– మంత్రి నారాయణ హెచ్చరిక
విజయవాడ, మహానాడు: వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి మంత్రి నారాయణ పర్యటించారు. కండ్రికలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులతో పాటు స్వయంగా ఇళ్ళలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఏమన్నారంటే..
విజయవాడలో పరిస్థితి మెరుగుపడింది. ఫైరింజన్లతో ఇళ్ళను శుభ్రం చేయిస్తున్నాం. మళ్ళీ వరద అంటూ తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నాం. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశాం. చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం. విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు.