కేంద్ర ఇచ్చిన డబ్బులకు యూసీలు ఇవ్వలేదు

* పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులను మళ్లించారు
* పంచాయతీరాజ్ విభాగంలో రూ.990 కోట్లు మళ్లించారు
– సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం

విజయవాడ: భవానీపురంలో వరద ఓవర్ ఫ్లో జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాలు శాపంగా మారింది. బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. బుడమేరును పూర్తిగా దురాక్రమణ, కబ్జాలు చేశారు. వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం.

మూడు బోట్లు వదిలిపెడితే కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టాయి. 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే సమయంలో బోట్లు వదిలారు. సాధారణ స్థితికి రావడానికి 10 రోజులు పట్టింది. గత ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలలైనా సరిపోయేది కాదు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు యూసీలు ఇవ్వలేదు. పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులను మళ్లించారు. పంచాయతీరాజ్ విభాగంలో రూ.990 కోట్లు మళ్లించారు.ధాన్యం ఇచ్చిన రైతులకు రూ.1650 కోట్లు బకాయిలు, రూ.10.5 లక్షల కోట్లు అప్పు.. రూ.లక్ష కోట్ల బిల్లు చెల్లించాలి. ఖర్చు పెట్టిన డబ్బులను ఖాతాలో చూపలేదు.

వరదల బాధితుల సాయానికి భారీ స్పందన వచ్చింది. ప్రతి ఇంటికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తున్నాం. మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు ఆర్థికసాయం. ఇళ్లలో నీళ్లు వచ్చిన బాధితులకు రూ.10 వేలు ఆర్థికసాయం. చిరు వ్యాపారులకు రూ.25 వేలు ఆర్థికసాయం.

నష్టపోయిన ఎంఎస్ఎంఈలకు ఆర్ధిక సాయం. రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.లక్ష, రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు రూ.1.5 లక్షలు. బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9 వేలకు పైగా క్లెయిమ్ లు. ద్విచక్ర వాహనదారులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్ చేశారు. రూ.6 కోట్లు చెల్లించాం.. 6 వేల క్లెయిమ్ లు పెండింగ్ ఉన్నాయి.

త్రిచక్రవాహనదారులకు రూ.10 వేలు ఆర్థికసాయం. ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తగా అందజేస్తాం. ద్విచక్రవాహనాలకు రూ.3 వేలు ఆర్థికసాయం. చేనేత కార్మికులకు రూ.15 వేలు ఆర్థికసాయం. మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులకు రూ.25 వేలు సాయం. ఫిషింగ్ బోట్లకు నెట్ దెబ్బతిని పాక్షిక ధ్వంసమైతే రూ.9 వేలు.

ఫిషింగ్ బోట్లకు నెట్ దెబ్బతిని పూర్తి ధ్వంసమైతే రూ.20 వేలు – ఫిషింగ్ బోట్ల(మోటార్)కు నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైతే రూ.25 వేలు. హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్ కు రూ.15 వేలు. పశువులకు రూ.50 వేలు, ఎద్దులకు రూ.40 వేలు సాయం దూడలకు రూ.25 వేలు, గొర్రెలకు రూ.7500 సాయం కోళ్లకు రూ.100, షెడ్డు ధ్వంసమైతే రూ.5 వేలు సాయం.

హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం. హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం .హెక్టార్ చెరకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు, హక్టార్ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్ధికసాయం హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు. జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు సాయం పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్ధికసాయం. కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు సాయం.

బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు సాయం జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు సాయం ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు సాయం మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు సాయం. పుచ్చ రైతులకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు సాయం దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు సాయం. డ్రాగన్ ఫ్రూట్ కు రూ.35 వేలు, పామాయిల్ చెట్టుకు రూ.1500 సాయం సెరీకల్చర్ కు రూ.25 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయం చేస్తాం.

175 సచివాలయాల పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవారికి రూ.50 వేలు. రీపేమెంట్ వ్యవధి 36 నెలలు, మారటోరియం వ్యవధి 3 నెలలు.మొదటి అంతస్తు, ఆపైన ఉండేవారికి రూ.25 వేలు సాయం చేస్తాం.దుకాణాలు, ఎంఎస్ఎంఈలకు రీషెడ్యూల్ చేయమని చెప్పాం దుకాణాలు, ఎంఎస్ఎంఈలకు రెండేళ్లు మారటోరియం కోరాం.