పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

– ఎమ్మెల్యే నజీర్ అహ్మద్

గుంటూరు, మహానాడు: పట్టణంలో 146&145 ఆఫీస్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచనలతో 51 డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అలాగే డెంగ్యూ, మలేరియా వ్యాధుల నుండి పరిరక్షించుకోవచ్చని తెలిపారు. నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధు నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.