– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ గ్రామంలో వరద ముంపునకు గురైన బాధితులకు రామ్కో సిమెంట్స్ వారి సౌజన్యంతో సుమారు 600 మందికి దుప్పట్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ పాలేరు ఒడ్డున ఉన్న బూదవాడ నుండి రెఢ్యా నాయక్ తండాకు వెళ్ళేందుకు, అదేవిధంగా రెఢ్యా నాయక్ నుండి బూదవాడకు వెళ్ళు రోడ్డు పూర్తిగా డామేజ్ అయిపోయి రాకపోకులు లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో రామ్కో సిమెంట్స్ స్పందించి వారి చొరవతో మిషన్లు ఏర్పాటు చేసి సుమారుగా 10 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఈ రోడ్డును ఏర్పాటు చేశారు.
అలాగే, వరద ముంపునకు గురైన వారికి సుమారు 600 మందికి దుప్పట్లు అందించారు. వారికి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రోడ్డు పనుల కోసం రామ్కో సిమెంట్స్ వారు స్థానికులను ట్రాక్టర్లు కావాలని అడగగానే చొరవ చూపి గ్రామ నాయకులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఆ ఓనర్స్ ను నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, రామ్కో సిమెంట్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.