సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షలు

గంటా కు చెక్ అందించిన ఫిల్మ్ నగర్ సొసైటీ

విశాఖపట్నం: విజయవాడ వరద బాధితులకు సాయం చేయడానికి వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించి, ఆ చెక్కును భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అందించారు. అనుకోని విపత్తుకు విజయవాడ తల్లడిల్లిందని, బాధితులను ఆదుకోవడానికి సొసైటి విరాళం ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటూ సాధారణ పరిస్థితి నెలకొల్పారని ప్రశంసించారు. చెక్కును తొందర్లోనే ముఖ్యమంత్రికి అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి భీమిలి ఇంచార్జీ కోరాడ రాజబాబు, ఫిల్మ్ నగర్ సొసైటీ ప్రతినిధులు కాయల వెంకటరెడ్డి, ఎం.ఎస్.ఎన్. రాజు, భాస్కర్ నాయుడు, కె.శివ బాలాజీ ప్రసాద్, ఎ.ఎల్.ఎన్.రాజు, బి.సురేందర్ రెడ్డి, ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్, బి.ఎన్.వి. మణికంఠ పాల్గొన్నారు.