త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం తన కార్యాలయంలో ప్రజల నుండి పలు సమస్యల పై అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో వివిధ కారణాలతో తమ పెన్షన్ల ను తొలగించారని, తిరిగి వాటిని పునరుద్ధరించి తమకు ఆదుకోవాలని పలువురు వృదులు కోరారు. అలాగే గుజ్జనగుండ్లలోని మారుతి నగర్ హరిజన కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో వలన మురుగునీరు రోడ్ల మీద పొంగి పొర్లుతోందని, వీధి దీపాలు కూడా వెలగటం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వెళ్ళారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. శ్రీనివాసరావు పేట 4వ లైన్ లో రోడ్లు ధ్వంసం అయ్యాయని, కొత్త రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరగా త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటించి, సమస్యను పరిష్కరిస్తానన్నారు.