విజయవాడ, మహానాడు: పట్టణంలోని గుర్రాలు చావడి వాస్తవ్యుడు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ ఖయ్యూం కుమారుడు (సయ్యద్ హిదాయితుల్లా మేనల్లుడు) ఇంజనీరింగ్ విద్యార్థి షేక్ ఉమర్ ఆదివారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకొన్న శాసన మండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ వారి భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులని పరామర్శించారు. వారివెంట సయ్యద్ బషీర్, హిదాయితుల్లా, సయ్యద్ జమీర్, ఏవీఎం సుభానీ, అబ్దుల్లా, సాతులూరి కోటి ,షేక్ జిలానీ (యూత్),షేక్ కరిముల్లా, హమద్, మహబుల్లా, అజీజ్ తదితరులున్నారు.