బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ పాటలను పాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.
మహిళలతో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిలు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను పండుగను జరుపుకున్నారు.
మహిళల బతుకమ్మ పాటలతో తెలంగాణ భవన్‌లో కోలాహలంగా మారింది.