(పులగం సురేష్)
పెళ్లిలకు ముహూర్తాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈనెల నుండే వివాహానికి శుభ ఘడియలు మెండుగా ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత ఐదేళ్లలో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చేఈ మూడు నెలల్లో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్ హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక అడ్వాన్స్ బుకింగ్ లు కూడా పెరిగాయని అంటు న్నారు. ఈనెల అక్టోబర్ పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు, తదితర శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైనదని రాష్ట్ర అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు తెలపడంతో, పెళ్లిళ్ల సన్నాహాలు మొదలుపెట్టే శారు.దీంతో అక్టోబర్ నెల రాకముందు నుంచే వివాహం కోసం ఫంక్షన్ హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్లకు బుకింగ్‌లు మొదల య్యాయి.
అక్టోబర్ 12,13,16,20,27 కాగా.. నవంబర్‌లో 3, 7, 8, 9, 10, 13, 14, 16,17, ఇక డిసెంబర్లో అయితే.. 5,6,7,8,11,12,14,15,26 ఇలా మూడు మాసాల్లో ముహూర్తాల తేదీలు వున్నాయి.
అయితే ఇలా మూడు మాసాలు కలిపి సుమారు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజా భజంత్రీలు, మండపాలను అలంకరించే వారికి, కేటరింగ్ వారికి కూడా ఓ రైంజ్ లో ఆర్డర్లు మొదలయ్యాయి. దీంతో దసరా ఉత్సవంతో పాటు శుభకార్యాలకు అనువైన నెల కావడంతో మార్కెట్ లోనూ సందడి మొదలైంది.
కాగా వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాల్లో అమ్మకాలు కూడా భారీగానే పెరిగినట్టు వ్యాపార వర్గాలు తెలుపుతున్నారు. బంగారం ధర పెరిగినప్పటికీ నగలు చేయించుకునేందు కు ఆర్డర్లు వస్తున్నాయని, వెల్లడించారు.