25 వేల కేజీల డ్రగ్స్ కేసు ఏమైంది?

– సీబీఐ,పోలీసులు, ఇంటర్ పోల్ చేసిన ఆపరేషన్ రిజల్ట్ ఏది?
– మార్చి నెల నుండి ఇప్పటివరకు విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసును ఎందుకు బయటపెట్టడం లేదు?
– ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్

విశాఖ: రాష్ట్రంలో ఇసుక ఇబ్బందుల వల్ల దాదాపుగా 26 సెక్టార్లకు సంబంధించిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక 370 రూపాయలు సీనరేజీ, వంద రూపాయలు హ్యాండిల్ చార్జెస్ టన్నులు 400కు అమ్మితే , 10 టన్నుల ఇసుక విజయనగరంలో అయితే 9వేలకు,గాజువాక అయితే 14వేలకి అమ్మేవాళ్ళు.

కూటమి ప్రభుత్వంల్లో పది టన్నుల ఇసుక విజయనగరంలో 17 వేలకు , విశాఖలో 20 నుంచి 22 వేలకు అమ్ముతున్నారు. ఇసుక సమస్యను రాజకీయ కోణంలో కాకుండా, ప్రజా సమస్యగా ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు చూడాలి. మా ప్రభుత్వం సీనరేజీ కింద 375 రూపాయలు వసూలు చేసింది. మరి ఈ ప్రభుత్వంలో ఉచిత ఇసుక అని చెప్పినప్పుడు ఇంకా తగ్గాలి కదా ధర ఎందుకు పెంచి అమ్ముతున్నారు?

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా ప్రైవేటీకరణ ఆపండి. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి నెత్తి మీద బండ రాయి వేయాలని ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ గానే ఉండాలి ప్రైవేట్ సంస్థ కాకూడదనేది మా డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై సీఎంకు ఒక లేఖ రాస్తాను.

మార్చి నెలలో విశాఖపట్నం కేజీల డ్రగ్స్ కంటైనర్ వచ్చింది.మా ప్రభుత్వంపై టీడీపీ మేము విమర్శలు చేసింది. పురందరేశ్వరి కుటుంబ సభ్యులకు సంబంధించినదని విమర్శలు వచ్చాయి. విశాఖపట్నం వచ్చిన 25 వేల కేజీల డ్రగ్స్ కు సంబంధించిన కేసు ఏమైంది? సీబీఐ,పోలీసులు, ఇంటర్ పోల్ చేసిన ఆపరేషన్ తాలూకా రిజల్ట్ ఏది? విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసుకు సంబంధించి సిబిఐకి,ఏపీ సీఎం చంద్రబాబు కి లేఖ రాస్తాను. మార్చి నెల నుండి ఇప్పటివరకు విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసును ఎందుకు బయట పెట్టడం లేదు? ప్రభుత్వం చెప్పాలి. విశాఖలో రైల్వే జోన్ కార్యాలయమే కాదు. డిఆర్ఎం కార్యాలయం కూడా విశాఖలో ఉండాలనేది మా డిమాండ్.