ఎన్డీయే ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి పెద్దపీట!

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో జీవించే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, యువనేత మనందరి స్ఫూర్తి ప్రదాత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం నాలుగు నెలల పాలనలో ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతుందన్నారు. దర్శి టౌన్, అద్దంకి రోడ్డులోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం ఆమె అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే శ్రీ వాసవి అమ్మవారి గుడిలో పూజలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడారు.

కూటమి పాలనలో దర్శి ప్రాంతాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని ఆమె అన్నారు. ఇప్పటికే నిరుద్యోగులకు జాబ్‌ మేళా, వైద్య శిబిరాలు వంటివి పెట్టామని, పల్లె ప్రాంతాలో మంచినీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఆలయా కమిటీ సభ్యులు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఆర్యవైశ్య పెద్దలు, దేవతి మహానంది, సురే సుబ్బారావు, బొగ్గవరపు సుబ్బారావు, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కోట హనుమంత రావు, అచ్యుత కొండలు తదితరులు పాల్గొన్నారు.