గుంటూరు, మహానాడు: గ్రంథాలయాల్లో విద్యార్థులు, పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు.
గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన నాయకులతో కలిసి పెమ్మసాని ఆదివారం పరిశీలించారు. గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించిన పెమ్మసాని భవన, నిర్వహణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్లాబ్ లు పెచ్చులూడి వర్షాలకు నీటి చెమ్మ వస్తుందని గ్రంథాలయ అధికారులు పెమ్మసాని దృష్టి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో కనీసం పేపర్లు, మ్యాగజైన్ల కొనుగోలుకు కూడా నిధులు కేటాయించకపోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.