– డాక్టర్ మాదల శ్రీనివాసు
అమరావతి, మహానాడు: అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ఈ విజయదశమికి తొమ్మిదేళ్ళు పూర్తయ్యాయి. ఈ కాలంలో ఏ లక్ష్యం కోసం రైతులు భూములు త్యాగం చేశారో, నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేశాయో ఆ అమరావతి నిర్మాణం కొరకు కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర ప్రజలంతా సమిష్టిగా కృషి చేశారని డాక్టర్ మాదల శ్రీనివాసు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణం పై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, చారిత్రాత్మక ఉద్యమం కొనసాగించి అమరావతిని కాపాడుకున్నారు. ఈ కష్ట ఫలితం దక్కాలంటే మనమంతా అదే స్ఫూర్తితో, సంయమనంతో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కార్యాచరణను కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. మనమంతా కలిసి ఒక్కటిగా ముందుకు కదిలి రాగల రెండేళ్ళలో ఈ మహత్తర లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ పవిత్ర విజయదశమి సందర్భంగా దీక్షాబద్ధులు కావాల్సిన అవసరం ఉంది.