సీఐడీకి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు!

– సర్కారు నిర్ణయం

అమరావతి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీఐడీకి బదలాయించాలని ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మంగళగిరి పీఎస్‌ల పరిధిలో కేసుల విచారణ జరుగుతోంది. కేసు తీవ్రత దృష్ట్యా, సీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ జైలుకెళ్ళారు. ఇదే కేసులో సజ్జల, దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.