మాచవరం వద్ద కుంగిన రైల్వే ట్రాక్!

– రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు

మాచవరం, మహానాడు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ట్రాక్ కుంగిపోయింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తిరుపతి-సికింద్రాబాద్ రైలును అధికారులు వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ సికింద్రాబాద్‌కు బయలుదేరింది. విజయవాడ-చెన్నై మార్గంలోనూ పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.