సీఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరిస్తాం

– ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నారాయణ

చల్లపల్లి, మహానాడు: చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించి పేద ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు కృష్ణాజిల్లా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్నసేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కొండాపూర్ లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో సి ఆర్ ఫౌండేషన్ నడుస్తుందని తెలిపారు. 85 గదులు, రెండు డార్మెటీరిలలో పేదవారికి ఆరోగ్య కేంద్రాలను, ఉపాధి శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో సీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఇక్కడ కూడా సేవలను విస్తరించునున్నట్టు పేర్కొన్నారు. సి ఆర్ ఫౌండేషన్‌ కు అనుసంధానం చేసి అభివృద్ధి చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని చంద్రరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు, మహిళా సమైక్య జిల్లా నాయకులు మల్లు పెద్ది రత్నకుమారి, కంఠం నేని జ్యోత్స్న దేవి, పార్టీ నాయకులుమల్లు పెద్ది అజయ్, మల్లు పెద్ది బోసు, కొల్లూరి శ్రీధర్, నాగమల్లి, గంగాధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.