అవినీతి సామ్రాట్లు టీడీపీ మీద విమర్శలా?

– ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్

విజయవాడ, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జే బ్రాండ్ల’ మద్యం మాత్రమే విక్రయించే వారు… వినియోగదారులు కోరుకున్న రకాలేవీ దొరికేవి కాదు… జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దారునాయక్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం నాసిరకం మద్యం అధిక ధరలకు అమ్మకాలు జరిపిందని, జే టాక్స్ రూపంలో కోట్లాది రూపాయిల జగన్ రెడ్డి ప్యాలెస్ లోకి వెళ్ళిపోయాయని దుయ్యబట్టారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ప్రైవేటు వారికి టెండర్లను పారదర్శకంగా లాటరీ ద్వారా ఎంపిక చేసిందని, తాజాగా మద్యం వ్యాపారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిందని, ఇప్పుడు వినియోగదారులు కోరుకునే కోట్ల బ్రాండ్లన్నీ అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్, పార్టీ రాష్ట్ర హెచ్ ఆర్ డి సభ్యుడు వల్లెపు నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు నాయకులు కొల్లి ఆంజనేయులు, ఎస్టీ నాయకులు బి వెంకటేష్ నాయక్, ఆర్ రామ్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.