– మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు
విజయవాడ, మహానాడు: ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ఈ సమయంలో 20 సూత్రాల కమిటీ చైర్మన్‌గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు లంకా దినకర్ ను నియమించడం శుభ పరిణామంగా చెప్పవచ్చని మహానాడు మీడియా అధినేత బోడేపూడి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దినకర్ చైర్మన్‌గా శనివారం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బోడేపూడి సుబ్బారావు, మహానాడు మీడియా ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, కో ఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్రలు ఆయనను అభినందించి, శాలువతో ఘనంగా సన్మానించారు.
బీజేపీ సీనియర్ నాయకుడు దినకర్ సేవలు ఎన్డీయే ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయని బోడేపూడి సుబ్బారావు అన్నారు. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న దినకర్.. కూటమి ప్రభుత్వంలో 20 సూత్రాల చైర్మన్ గా 20 పథకాలు విజయవంతంగా అమలు చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అటు మంత్రులను, ఇటు అధికారులను సమన్వయం చేసుకొని అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి లంకా దినకర్ పాటుపడాలని సుబ్బారావు కోరారు.