చార్‌ధామ్‌ యాత్ర ముగింపు తేదీలివే!

ఉత్తరాఖండ్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ ఆ వివరాలు వెల్లడించారు. నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడోతేదీన మూసివేస్తామని వెల్లడించారు. అలాగే నవంబర్ నాలుగోతేదీన తుంగనాథ్ ధామ్ తలుపులు, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామని తెలిపారు. భక్తులు ఈ విషయాలను గమనించాలని ఆయన కోరారు.