– మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు, మహానాడు: తెనాలిలో పల్లె పండుగ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. ఖాజీపేట గ్రామంలోని అనుమర్లపూడి, కొలకలూరు, ఎరుకలపూడి, కటేవరం, సంగం జాగర్లమూడి అంగలకుదురు మల్లెపాడు, జగ్గడిగుంటపాలెం గ్రామంలోని నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్లుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆర్ధిక ఇబ్బందులు ఉన్న ‘సూపర్ సిక్స్’ అమలుతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతుంది.. చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటూ పట్టుదలతో రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం అభివృద్ధి సంక్షేమం తో ముందుకు వెళ్తుంది.. రాబోయే రోజుల్లో చేసే ప్రతి పనిలో నిజాయితీగా పారదర్శకంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అంతిమంగా ప్రతి పేదవాడి కుటుంబానికి ఏదో ఒక రకంగా ఆదుకొనే తపనతోనే ముందుకు వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంతో మంచి జరుగుతుందని ఓటు వేశారు. ముఖ్యంగా మహిళలు అది గౌరవించుకుంటూ గుర్తు పెట్టుకుంటూ ముందుకు సాగుతామని మంత్రి పేర్కొన్నారు.