– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన గడిచిన నాలుగు నెలలుగా ఆపదలో, అవసరంలో ఉన్న వారు అడిగి వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆపన్నహస్తం లభిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎమ్మెల్యేను కలవాలి అంటేనే నెలలు తరబడి తిరగాల్సిన పని లేదని, అయినా సాయం అందుతుందో లేదో అన్న ఆందోళనతో నిరీక్షించాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమం త్రి సహాయ నిధి నుంచి అడిగి వారికి లేదనుకుండా సాయం చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఎంతో మంది చిన్నారులు, విధివంచితులకు ప్రాణదాతగా నిలుస్తున్నారన్నారు. నియోజకవర్గానికి చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ.6.91 లక్షల విలువైన ముఖ్యమంత్రి ఆర్థిక సహాయనిధి చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే అందజేశారు.
గ్రంధి లక్ష్మీపార్వతికి రూ.51,310, బొందిలి నాగప్రసన్నబాయికి రూ.40,600, గణపవరానికి చెందిన కోమటినేని పావనికి రూ.1.50 లక్షలు, లింగంగుంట్లకు చెందిన మద్దుకూరి రమాదేవికి రూ.95,601, గజ్జల శివకుమార్‌కు రూ.25 వేలు, కావూరుకు చెందిన నాయుడు శ్రీనివాసరావుకు రూ.75 వేలు, అప్పాపురానికి చెందిన ఆరేటినాగేశ్వరరావుకు రూ.1,51,333, దింతెనపాడుకు చెందిన అత్తోట రామారావుకు రూ.1,02,619 విలువైన చెక్కులను అందజేశారు.