– కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
అనంతపురం, మహానాడు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చే వాగులు, వంకల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే సోమవారం రాత్రి భారీ వర్షం కురిసిందని, జిల్లాలో చెరువులు, వాగులు కింద ఉండే లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కలెక్టర్ సూచించారు.