వరదలో చిక్కుకున్న హీరో నాగార్జున

అనంతపురం, మహానాడు: అనంతపురంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. జనజీవనం స్తంభించిపోయింది. పండ మేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. వాహనంపై మంగళవారం అటువైపు వెళ్ళిన సినీ నటుడు అక్కినేని నాగార్జున వరదలో చిక్కుకున్నారు. అనంతపురంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవం లో ఆయన పాల్గొనాల్సి ఉంది. పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారు వరదలో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మరో దారిలో పుట్టపర్తి నుంచి అనంతపురానికి ఆయనను తీసుకువెళ్ళారు. కాగా, బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలించింది.