– హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్
అమరావతి: గతంలో తనపై విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్ పోర్టు వెనక్కి ఇప్పించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.
పిటిషనర్ కుమారుడు సింగపూర్లో ఉన్నత విద్యకు వెళుతున్నారని, తండ్రిగా పిటిషనర్ కూడా వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో పాస్పోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పోలీసుల తరపు న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. అంగీకరించిన హైకోర్టు, విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.