– టీడీపీ నేత తిప్పేస్వామి
మడకశిర, మహానాడు: గుంతల, అధ్వాన్న రోడ్ల రహిత ఏపీ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మడకశిర పట్టణం వైబి హళ్లి రోడ్డులో ఏర్పడిన గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించి, మాట్లాడారు. వైసీపీ పాలనలో అభివృద్ధిని పడకేసి రోడ్లన్నీ గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ విధంగా లేకుండా కూటమి ప్రభుత్వం లో జనవరి లోపల రాష్ట్రవ్యాప్తంగా గుంతలు లేకుండా చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉమాశంకర్, బలరాం, రమేష్, వెంకట లక్ష్మమ్మ, కన్వీనర్ దాసి రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు నాగరాజు, నరేష్ కన్నా, రఘురాం, మాజీ కౌన్సిలర్లు నాగరాజు, డాక్టర్ సెల్ కృష్ణమూర్తి, తెలుగు యువత తిమ్మరాజు, బాబు, గంగాధర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.