– ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, మహానాడు: ఎక్కడా రాజకీయ వివాదాలకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు సామాన్యులకు అందే విధంగా కృషి చేయాలని స్థానిక నేతలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30 డివిజన్ నక్కా గోపాల్ నగర్ లో 35 లక్షల రూపాయ ల వ్యయంతో రోడ్లు, పైప్ లైన్ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు విడుదల చేయలేదని, రాబోయే రోజుల్లో 26 డివిజన్ల లో ఒక్కో డివిజన్ కు అభివృద్ధి పనులకు కోటి రూపాయలు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, డివిజన్ ఇన్చార్జి ఆషిక్ అలీ ఖాన్, డివిజన్ అధ్యక్షుడు మన్నెమాల శ్రీనివాసులురెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ కూకటి హరిబాబు యాదవ్, టీడీపి నాయకులు అత్తివరపు యానదయ్య, ఓబుల్ రాజు, బత్తల కృష్ణ, పల్నాటి మస్తాన్ నాయుడు, ఖాదర్ బాషా, కరీముల్లా, జున్ను, తదితరులు పాల్గొన్నారు.