సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక వద్ద గుంటూరుకు చెందిన అమృత హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమృత హాస్పిటల్స్ వారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా మోకాలు మార్పిడి సర్జరీల శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.