పెండింగ్‌ బిల్లులకు ఆమోదం గొప్ప నిర్ణయం!

వినుకొండ, మహానాడు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదలకు పచ్చ జెండా ఊపడంతో ఎంతోమందికి న్యాయం జరగబోతోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కీలకమైన ఆ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2014-15 నుంచి 2018-19 మధ్య పనులు చేసి, బిల్లులు రాక ఇంతకాలం ఎన్నో అవస్థలు పడుతున్న కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లకి ఇది ఊపిరి నిలిపే శుభవార్తగా పేర్కొన్నారు. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో ఈ మేరకు నీరు చెట్టు పనుల బకాయిల చెల్లింపులు చేయాలన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతోమంది అప్పులు తెచ్చి మరీ పనులు చేసినా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపుల కారణంగా బిల్లులు నిలిపివేయడంతో ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా చూడాల్సిన వచ్చిందని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.