ట్రంప్ గెలుపుతో బిట్కాయిన్ కు క్రేజ్.. రూ.64లక్షలు దాటేసింది

డొనాల్డ్ ట్రంప్ విజయంతో బిట్కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్లు USBTC ETFల్లో పెట్టుబడులు పెట్టడంతో 10% పెరిగి తొలిసారి $76000కు చేరుకుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.64 లక్షలతో సమానం. ఈ ఏడాది ఆరంభంలో రూ.30లక్షల వద్ద ఉన్న BTC నవంబర్ నాటికి 100% రిటర్న్ ఇవ్వడం విశేషం. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, రాబర్ట్ కియోసాకి సహా చాలామంది రిపబ్లికన్లు క్రిప్టో కరెన్సీకి గట్టి మద్దతుదారులు.

ట్రంప్ విజయం.. మస్కు ₹2.2లక్షల కోట్లు లాభం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్కు మద్దతుగా ప్రచారానికి $119 బిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.