* ఎమ్మెల్యే మాధవి
గుంటూరు, మహానాడు: గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖాన ఆడిటోరియంలో డాక్టర్ నిర్మల స్మారక ఉపాన్యాసం నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి ముఖ్య అతిధిగా హాజరై, ప్రసంగించారు. కరోనా మహామ్మారి విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, కరోనా వంటి తీవ్ర విపత్కర సమయాల్లో కుడా వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి అనేక మందికి ప్రాణం పోశారని ఎమ్మెల్యే అభినందించారు. వైద్య వృతి ఎప్పటికి ఆదాయ వనరుగా చూడకుండా, అనేక మంది వైద్యులు సేవగా భావిస్తున్నారని వారిని స్ఫూర్తిగా తీసుకొని, ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.