తల్లి, చెల్లిలపై చెడ్డగా పోస్టులు పెట్టినా చలనం లేని జగన్‌!

– వర్రా రవీంద్ర రెడ్డికి ఎందుకు కొమ్ముకాస్తున్నారు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సూటి ప్రశ్న

మంగళగిరి, మహానాడు: జగన్ తల్లి, చెల్లిలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అత్యంత అమాయకుడు, అతని కోసం ఎంతమంది లాయర్లనైనా పెడతానని జగన్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వర్రా రవీంద్రా రెడ్డి జగన్ తల్లి, చెల్లి లపై పెట్టిన పోస్టులను ఒక్కొక్కటిగా చదువుతూ జగన్ పై పలు ప్రశ్నలు సంధించారు.

జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేసిన వర్రా రవీంద్రారెడ్డిని జగన్ వెనకేసుకరావడం సిగ్గుచేటు. వర్రా రవీంద్రరెడ్డి మంచివాడు అని జగన్ అంటే నేను జగన్ ఇంటిముందు నిలబడి సెల్యూట్ చేయడానికి సిద్దంగా ఉన్నాను. జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై వర్రా రవీంద్ర రెడ్డి పెట్టిన పోస్టులు అత్యంత అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ఆ పోస్టులు షర్మిల గనుక చూస్తే కత్తితో నిన్ను పొడవనా? నేను పొడచుకోనా? అని జగన్ పైకి వస్తుందనడంలో సందేహం లేదు. ఇంతటి జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కాపాడడానికి జగన్ కు మనస్సెలా ఒప్పింది?. పాత్రికేయ సమావేశంలో జగన్ వర్రా రవీంద్రను మంచివాడని అనడంతో సిగ్గుకే సిగ్గనిపించేలా ఉంది. జగన్ తల్లి, చెల్లిపై పెట్టిన పోస్టులపై జగన్ కు రక్తం ఉడికి ఉంటుందనుకునేరు.. కానీ అలా జరగలేదు.
ఎవరికో పుట్టిన షర్మిలను జగన్ సొంత చెల్లిలా చూసుకున్నాడు అని వర్రా రవీంద్ర రెడ్డి పోస్టు పెడితే జగన్ ఈ విధంగా స్పందించడం చెల్లి పట్ల ఆయనకున్న అభిప్రాయం తెలియజేస్తోంది. జగన్ గతంలో దుర్మార్గం, దురాలోచనలతో ఎదుటివారిని మానసికంగా హింసించి శునకానందం పొందేవారు. ఆ దురాలోచనే జగన్ తల్లిని, చెల్లిని తాకాయి. అసభ్యకర పోస్టులు పెట్టినవారిని కాపాడడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి జగన్ వార్ రూమ్ పెట్టడం దుర్మార్గం. తల్లిని, చెల్లిని దూషిస్తే ఊరుకునేవారిలో జగన్ ప్రథముడని తెలుస్తుంది.

పోలీసులు పద్ధతి మార్చుకోవాలి
రాష్ట్ర పోలీసులు జగన్ పాలనకి అలవాటు పడ్డారు. వారు పద్ధతి మార్చుకోవాలి. డాక్టర్ సుధాకర్ ను నడి రోడ్డుపై ఈడ్చి వేధించి ఆ డాక్టర్ మృతికి కారణమైంది వైసీపీ ప్రభుత్వమే. ఈ విషయం జగమెరిగిన సత్యం. 16 ఏళ్ల దళిత మహిళను ఐదుగురు దుండగులు పోలీసు స్టేషన్ వెనుక గదిలో అత్యాచారం చేసి పోలీసు స్టేషన్ ముందు పడేస్తే జగన్ కు ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా? గతంలో జగన్ అండ్ టీమ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను, చివరకు మమ్మల్ని కూడా తిట్టారు. వారి వారి కుటుంబాలను కూడా నిందించారు అయినా సహించి వదిలేశాం. జగన్ తల్లి, చెల్లిల గురించి బూతు పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డిని అరెస్టు చేయాలో? వద్దో జగనే చెప్పాలి. ఈ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం.

వైసీపీ హయాంలో ఉగాండాలో ఉన్న ఒక కొడుకు.. సోషల్ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబుల్ రెడ్డి పనితీరును ప్రశ్నిస్తూ పోస్టు పెడితే.. 70 ఏళ్ల వయసున్న వాళ్ల నాన్న అయిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేసి హింసించారు. అప్పుడు జగన్ కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? జగన్ కుటుంబ సభ్యులైన తల్లి, చెల్లిల గురించి వర్రా రవీంద్ర పెట్టిన పోస్టులు చూసి ఇతరులకే జుగుప్సకలిగిస్తుంటే.. జగన్ మాత్రం మౌనం వహించడంలో మర్మమేమిటి? తెలియాలి. పత్రికల్లో రాయడానికి, చదవడాకి కూడా ఇబ్బందికరంగా ఉండే పదాలు ఆ పోస్టుల్లో రాశారు. జగన్ కు ఓడిపోతేగానీ చట్టాలు, ప్రజాస్వామ్యం గురించి గుర్తుకు రావా?

11 సీట్లు వస్తేనే ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా?
ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తే అప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వేచ్ఛ, పౌరసత్వం ఇవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చాయా? పోలీసు సంస్థని జగన్ జేబు సంస్థగా వాడుకున్నారు. అల్లాడించారు. అవినాష్ కాన్వాయ్ లో దొంగ కార్లు ఉన్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో చట్టాలను ఉల్లంఘించొద్దని పోలీసు సోదరులను కోరుతున్నాను. తిరుపతి ఎస్పీ సుబ్బారావును జగన్ చులకన చేసి మాట్లాడారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని అలా మాట్లాడొచ్చా? పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్, ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏం చేస్తోంది? ఎందుకు అతనిపై కేసు రిజిష్టర్ చేయలేదు? చట్టానికి ఎవరూ అతీతులు కారు.. జగన్ పై కేసు రిజిష్టర్ చేయాలి. జగన్ హయాంలో చట్టబద్ధంగా నడిచే చంద్రబాబుపైనే 20 కేసులు నమోదు చేశారు.

చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. తప్పు చేసిన పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలేది లేదని జగన్ సొల్లు మాటలు ఎవరికీ తెలియనివి కావు. న్యాయస్థానాలు జగన్ ని ఎందుకు ఇంత స్వేచ్ఛగా వదిలేశాయో అర్థం కావడంలేదు. 12 ఏళ్ల పాటు కేర్టుకు హాజరు కాకపోయినా జగన్ ని ఎందుకు కోర్టులు క్షమిస్తున్నాయో అర్థం కాకుండా ఉంది. Why courts allowed to free move. ఈ లిటికేషన్ ఏంటో తెలియడంలేదు. జై చంద్రబాబు అన్నందుకు టీడీపీ అభిమాని పీక కోసేశారు. అప్పుడు జగన్ కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రాలేదు. జగన్ మానసిక స్థితి గురించి ఏమనుకోవాలో.. వైసీపీ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.