వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యశాఖ పెద్ద యజ్ఞం

ఇంటింటికీ ఉచితంగా అత్యవసర మెడికల్‌ కిట్లు
తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

గొల్లపూడి: నారాయణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్ చింతారెడ్డిపాలెం (నెల్లూరు), ఎపీఎం అండ్ హెచ్ ఎన్టీఆర్ జిల్లా వారు విజయవాడ రూరల్ మండలంలో షాబాద-జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, రాయనపాడు, పైడూరుపాడు, గొల్లపూడి గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా అత్యవసర మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గొల్లపూడి సాయిపురం కాలనీలో తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుల మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దేవినేని ఉమా మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సైనికుల్లా పనిచేస్తూ, సేవలందిస్తున్నారన్నారు. మంత్రి నారాయణ సూచనల మేరకు వరద భాదితలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాదికి పైగా వైద్య సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారన్నారు. అధిక వర్షం- వరదల వల్ల వచ్చే కాలానుగుణ వ్యాధుల నుండి రక్షణ పొందాలని సూచించారు.