దాడులు అపకుంటే ఎన్నికల బహిష్కరణ
అర్చక, పురోహిత సంఘం వెల్లడి
కాకినాడ: రాష్ట్రంలో బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని, కాకినాడ జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సామాజికవర్గంపై జరుగుతున్న దాడులు ఆపని పక్షంలో ఈ ఎన్నికలు బహిష్కరిస్తామని బ్రాహ్మ ణ, అర్చక, పురోహిత సంఘం ప్రతినిధులు హెచ్చరించారు. ఆదివారం బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయాన్ని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.హెచ్.వి.సాంబశివరావు, కామర్స్ చిరంజీ వి, పి.సోమసుందరం, వడ్డాది గోపికృష్ణ, కె.హనుమంతరావు, జొన్నలగడ్డ కామేష్ తదితరులు సందర్శించి అర్చకులతో మాట్లాడారు. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో వివా హం చేయించేందుకు వచ్చిన ఇద్దరు పురోహితులపై అక్కడి వర్గం వారు అత్యంత దారుణంగా దాడి చేశారని, ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు.
ఎవరైతే ఈ వీడియో తీసి దానికి ఒక పాట జోడిరచి ఆ డీప్ క్రియేషన్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టా రో వారిపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టాలని, లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మూలపేట గ్రామ పెద్దలతో సమావేశం పెట్టించి ఆ పురోహితునికి బహిరంగ క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. ఇక బిక్కవోలు దేవాదాయ శాఖకు చెందిన లక్ష్మీ గణపతి ఆలయంలో అర్చకులకు పోటీగా మరో నూతన వ్యక్తిని తీసుకొచ్చే విషయంలో కూడా నేరుగా ఆలయానికి వెళ్లి చర్చించామన్నారు. ఈ రెండు ఘటనలపై దేవాదాయ కమిషనర్, జాయింట్ కమిషనర్లతో మాట్లాడినట్లు చెప్పారు. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో నూత నంగా ఏ అర్చకుడిని నియమించడం లేదని చెప్పారన్నారు. రెండురోజుల్లో అర్చకులతో ఈవోను కూడా పిలిపించి మాట్లాడుతానని జాయింట్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మూలపేటకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరగా పిఠాపురం సీఐకు సూచించినట్లు తెలిపారు. తమకు మద్దతుగా ఉన్న రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.