ఏకలవ్యుని కాంశ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం

– ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

కావలి, మహానాడు: వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి కావలి పట్టణంలో ఏకలవ్యుని కాంశ్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని ఒక కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొగిలి కల్లయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.

ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉండి పరిష్కరిస్తానని తెలిపారు. కష్టాన్ని నమ్ముకొని పనిచేసే నిజాయతీ పరులు, ధైర్యవంతులు ఆదివాసీలని తెలిపారు.. నాగరికత పెరిగే కొద్దీ చేసే వృత్తులు, పనిచేసే విధానం, నడవడిక ను బట్టి కులాలుగా ఏర్పడటం జరిగిందన్నారు.. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలని, తద్వారా అందరూ ఆర్ధికంగా బలోపేతం కావచ్చని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో వికె శీనా నాయక్, తలిఆకుల వెంకటేశ్వర్లు, టీడీపీ కావలి పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, మహిళా అధ్యక్షురాలు అర్షియా బేగం, నారయ్య, సామాజిక కార్యకర్త మాలకొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు..