వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం

– ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం, మహానాడు: మహర్షి శ్రీ వాల్మీకి భగవానుడి జయంతి వేడుకల్లో ఇంత మంది వాల్మీకి సోదర సోదరీమణులు మధ్య పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. వాల్మీకి సోదరులతో కలిసి వాల్మీకి కూడలిని మరింత అభివృద్ధి చేసి చక్కని ఆహ్లాదకరమైన సర్కిల్ గా తీర్చిదిద్దుతామని, అలాగే వాల్మీకి మహర్షి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం వాల్మీకి సర్కిల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మాకంగా చేపట్టిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం వాల్మీకి సీనియర్ నాయకులకు ఎమ్మెల్యే ఘన సన్మానం చేశారు.