– గుంటూరు జిల్లాలో విషాదం
గుంటూరు, మహానాడు: వరదలో ఓ కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. దీంతో గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. శనివారం పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మృతి చెందారు. వీవీఐటీ – వీవా స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుల కుటుంబాలను పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుపున రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇదిలావుండగా, మంగళగిరి గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడటంతో పక్క ఇంట్లో ఉన్న నాగరత్నమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.