కర్నూలు,మహానాడు :సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను ఇష్టానుసారంగా దూషించినందుకు సినీనటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదు అయింది. వారితో పాటు మంత్రులు లోకేశ్, అనితపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది.సామాజిక మాధ్యమాల్లో వారిపై అసభ్య కామెంట్స్ చేసినందుకు టీడీపీ నేత రాజుయాదవ్ శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీరెడ్డిపై చర్యలకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని కొందరు నేతలు శ్రీరెడ్డి మాయ మాటల్లో పడి పార్టీ ప్రతిష్ట తీసారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తునారు.