మంగళగిరి : కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించారు. దాంతో టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం తాడేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.