గుడ్లవల్లేరు, మహానాడు: స్థానిక ఇంజినీరింగ్ కళాశాల లో జరిగిన సంఘటనపై గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు లేనట్టు గుర్తించామని కృష్ణా జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనిపించలేదు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తదుపరి విచారణ జరుగుతుంది. ఈ నేరంలో తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.