ఎఫ్‌ఐఆర్‌లో వారిని చేర్చకపోవడం సరికాదు
ఎన్నికల కమిషన్ విచారించి రిపోర్ట్ పంపాలి
టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్
హైదరాబాద్: బీజేపీ ఎన్నికల ప్రచారంలో మే 1న హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో చిన్నారులను తీసుకురావడంపై మొఘల్‌పురా స్టేషన్‌లో కేసు నమో దైందని, దీని మీద ఎన్నికల కమిషనర్ విచారణ చేసి రిపోర్ట్ పంపాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. అయితే రాజాసింగ్, మాధవిలతపై కేసు నమోదు చేశామని చెబుతున్నారు. కానీ ఆ ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా, కిషన్ రెడ్డిల పేర్లు మాత్రం చేర్చడం లేదని నోటీసులు పంపడం సరికాదన్నారు. చిన్నారుల ప్రచారంలో పాల్గొన్న అన్ని వీడియోలు పంపామని, ఇది ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడమేనన్నారు. కొంతమంది పేర్లు చార్జిషీట్‌లో తొలగించే ప్రయ త్నం చేస్తున్న సంబంధింత పోలీసుల మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.