సీఎం జగన్‌పై దాడి కేసులో డీసీపీ ప్రకటన
విజయవాడ, మహానాడు: విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టించిన వారికి రూ.2 లక్షలు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ సోమవారం ప్రకటించారు. ఖచ్చితమైన సమాచారం, దృశ్యాలను (సెల్‌ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చని, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి చెప్పవచ్చని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దిగువ సూచించిన ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా కానీ, నేరుగా అయినా సమాచారం అందించవచ్చని సూచించారు. ఫోన్ నెంబర్లు: కంచి శ్రీనివాసరావు, డీసీపీ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ – 9490619342, ఆర్.శ్రీహరిబాబు, ఏడీసీపీ, టాస్క్ ఫోర్సు – 9440 627089, ఆఫీస్ అడ్రస్: కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట్, కృష్ణలంకలో సంప్రదించవచ్చని సూచించారు.