ఏపీలో అన్న క్యాంటీన్ పేరిట ఛారిటబుల్ ట్రస్టు

అమరావతి, మహానాడు: ఏపీలో అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఇక ఆదాయపన్ను మినహాయింపు లభించనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించనున్నారు. ఇందుకోసం ‘అన్న క్యాంటీన్’ పేరుతో ఛారిటబుల్ ట్రస్టును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు లభించాయి. వచ్చే నెలలో ట్రస్టు ప్రారంభమవుతుంది.