-కాంగ్రెస్‌ను ప్రమోషన్ చేసుకునేందుకే…
– ప్రజలను దగా చేయడమే ఆ పార్టీ ఉద్దేశం
-హామీలు నెరవేర్చి సంబరాలు చేయండి
– నాడు కేసీఆర్…నేడు రేవంత్ సెంటిమెంట్‌తో ఆటలు
– బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి.సుభాష్
హైదరాబాద్, మహానాడు: హామీలు నెరవేర్చకుండా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతిని ధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి.సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం పార్టీ కార్యాల యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీవి బోగస్ మాటలేనని, ప్రజలను దగా చేయడమే వారి ఉద్దేశమని మండిపడ్డారు. ఎన్నికల ముందు రైతులు ఎంత ధాన్యం పండిరచినా వరిపంటకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటూ దగా చేస్తున్నారు. రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండిరచే మెజార్టీ రైతులకు మొండిచెయ్యి చూపించారు. కష్టించి పండిరచిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసింది అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇచ్చింది లేదు. రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ అన్నారు..ఆగస్టు పేరుతో పంగనామం పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
పార్టీ ప్రమోషన్ కోసమే దశాబ్ది ఉత్సవాలు
కేబినెట్ మీటింగ్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది దినోత్సవాలను నిర్వహించేం దుకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ నిర్వహించేది దశాబ్ది ఉత్సవాలా? దశ దిశ లేని కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యాలను కప్పిపు చ్చుకునే ఉత్సవాలా? చెప్పాలని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో సుమారు రూ.500 కోట్లు దుర్వినియోగం చేసింది. నాడు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో చిక్కుకుంటే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రమోషన్లకు ప్రజల సొమ్మును దారిమళ్లించారు. ఇప్పుడు అదే పంథాతో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
సమస్యలు తీర్చి సంబరాలు చేయండి
బీజేపీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. 2014లో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు సంపూర్ణ మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. గ్యారంటీలు, హామీలు నెరవేర్చకుండా రైతులను క్షోభ పెడుతూ, ప్రజలను ఇబ్బందులు పెడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం సరికాదు. సమస్యలు తీర్చకుండా ప్రజాధనా న్ని దుర్వినియోగం చేయాలనుకుంటున్న కాం గ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రజలను సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోవాలనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముందు ప్రజల సమస్య లు తీర్చి సంబురాలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.