– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: భారీ వర్షాలతో కాలువలు వరద ఉద్ధృతితో ప్రవహిస్తున్నాయని, వైసీపీ ప్రభుత్వం కాలువలను మరమ్మతు చేయకపోవడంతో ఎక్కడికక్కడే మురికి నిలిచిపోయి, ప్రజలు ఇబ్బందులు పడేవారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. దర్శి పట్టణం, పొదిలి రోడ్డలోని ఆర్టీవో ఆఫీసు వాగు వద్ద డ్రైనేజీ వ్యవస్థను ఆమె శనివారం పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా ముందుగానే దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులతో చర్చించి, గడియార స్తంభం వద్ద నుండి పొదిలి రోడ్డు, కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్డు లలో గల డ్రైనేజి లో పూడిక తీయించినట్టు తెలిపారు. ప్రస్తుత వర్షాల వల్ల ఈ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేదన్నారు.