లంచాల భార్యను పట్టించిన భర్త!

మనికొండ, మహానాడు: నిత్యం లంచాలు పుచ్చుకుంటున్న భార్యను మీడియాకు పట్టించాడు ఆమె భర్త. శ్రీపాద్‌, దివ్యజ్యోతి భార్యాభర్తలు.

దివ్యజ్యోతి మనికొండ మున్సిపల్ డీఈఈగా పనిచేస్తోంది. అయితే, ప్రతి రోజు దివ్యజ్యోతి అక్రమంగా లక్షల్లో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేది. ఈ వ్యవహారం నచ్చక భర్త శ్రీపాద్‌ తప్పని చెప్పేవాడు. దీంతో అతన్ని ఆమె తిట్టేది. ఈ లంచాల తిట్లు భరించలేక ఒక రోజు ఇంట్లో లంచాలు చక్కపెడుతుండగా వీడియోలు తీశాడు. విడాకులూ ఇచ్చాడు. ఆ వీడియోలను మీడియాకు అందజేసి, పట్టించాడు.