లడ్డును వేలం పాటలో దక్కించుకున్న ముస్లిం దంపతులు

-వెల్లివిరిసిన మత సామరస్యం
-దంపతులను మెచ్చుకుంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

కాగజ్‌నగర్‌: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం భట్ పల్లి గ్రామపంచాయతీ లో వినాయక మండపంలో గణేశుని లడ్డు వేలంలో రూ.13,216/- ల‌కు అదే కాలనీకి చెందిన ముస్లి వేలంలో రూ.13216/- ల‌కు అదే కాలనీకి చెందిన ముస్లిం దంపతులు అఫ్జల్ -ముస్కాన్ వేలంపాటలో దక్కించుకోవడం అందరినీ ఉత్సాపరిచింది. ఈ సందర్భంగా ముస్లిం దంపతులను స్థానికులు అభినందించారు. మతాలు-కులాల పేరుతో కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ముస్లిం దంపతులు వినాయకుడి లడ్డును వేలం పాటలో కొనుగోలు చేయడం గొప్ప విషయమన్నారు.