-కూటమి అధికారంలోకి రావడం ఖాయం
-గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు
గురజాల: యుగపురుషుడు ఎన్టీఆర్ ఆశీస్సులతో జూన్ 4న రాష్ట్రంలో నూతన శకం ఆరంభం కానుందని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆ మహనీయుని 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. సృష్టి ఉన్నంతకాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని, అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పార్టీ 30 సంవత్సరాలు గా చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. చంద్రబాబు పట్టుదల, లోకేష్ యువ గళం పాదయాత్ర వెరసి పార్టీ అధికారంలోకి రావడానికి కూడా దోహదపడుతు న్నాయని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.