రైతులు ఇబ్బంది పడుతున్నారు…స్పందించండి
పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను పరిష్కరించాలని వినతి
దెందులూరు: మీ వల్ల నారుమళ్లు పోసే సమయంలో రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు…సత్వరమే చర్యలు చేపట్టాలని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమ నేని ప్రభాకర్ విద్యుత్ శాఖ అధికారులను కోరారు. పెదవేగి మండలం దుగ్గిరాల లోని కార్యాలయంలో శనివారం పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు – విద్యుత్ శాఖ జాప్యంపై పలువురు రైతులు చింతమనేనికి గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో విద్యుత్ అధికారులతో చింతమనేని ఫోన్ చేసి మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ఘటనల్లో పోలీసు శాఖ ఉదాసీనతపై విద్యుత్ సీఎండీ, రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని సూచించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. నారుమళ్లు వేసే సమయంలో రైతులు తమ పొలాలకు ట్రాన్స్‌ఫార్మర్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని, సత్వరమే ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.