– ఎమ్మెల్యే గళ్ళ మాధవి
గుంటూరు, మహానాడు: సమసమాజ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. శనివారం గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. సంఘ సంస్కరణే లక్ష్యంగా ఆ మహనీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహితీ లోకంలో ఆయన దిగ్గజ వ్యక్తిగా నిలిచిపోతారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జాషువా పోరాడారన్నారు. తన సాహిత్యంతో సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని ఎమ్మెల్యే గళ్ళ మాధవి కొనియాడారు.
దీక్షకు సంఘీభావం
ప్రాయశ్చిత్త దీక్షకు ఎమ్మెల్యే గల్లా మాధవి సంఘీభావం తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో జిల్లా జనసేన పార్టీ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను సందర్శించారు.