మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషికి అరుదైన గౌరవం!

హైదరాబాద్, మహానాడు: మెగాస్టార్ చిరంజీవి స్వ‌యం కృషితో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
తాజాగా మెగాస్టార్‌ కి మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. ఈ విష‌యాన్ని తెలియ‌ జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఆదివారం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు. డాన్స్‌కి కేరాఫ్‌ అడ్ర‌స్‌గా నిలిచారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24,000 స్టెప్పులు వేసినందుకు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంతో  మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.